Singer Sunitha: మగాడి మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయవచ్చా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Sunitha: ఆనంద్ రవి,కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరమీను.. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని తెలిసిందే లే అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ సునీత మాట్లాడుతూ..” ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒకరికి నా బెస్ట్ విషెస్. ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బావుంటే కొత్త నటీనటులతో చేసిన మూవీ అయినా ప్రపంచ వ్యాప్తంగా పేరుని సంపాదించుకుంటుంది. అటువంటి లిస్టులో కొరమీను సినిమా కూడా చేరుతుంది. నమ్మి డబ్బులు పెట్టిన సమన్య రెడ్డిగారికి ఆల్ ది బెస్ట్. ఆనంద్ రవిగారు నాకు హ్యాపీడేస్ నుంచి పరిచయం. ఆయన మంచి రైటర్, నటుడు అయ్యారు. ఆయనకు కంగ్రాట్స్. టీజర్ చూడగానే మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయవచ్చా అనిపించింది. డైరెక్టర్‌కి హ్యాట్సాఫ్. మ్యూజిక్ డైరెక్టర్ అనంత్ వర్క్ చూస్తే తన ఫస్ట్ సినిమాలాగా అనిపించలేదు. కచ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. మన జీవన విధానానికి దగ్గరగా ఉండే సినిమాలు సక్సెస్ అవుతాయి. అలాంటి ఓ సినిమానే కొరమీను. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇది కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. సాంగ్స్, మ్యూజిక్ ద్వారా ఈ పాటలు రిలీజ్ కావటం నాకెంతో గర్వంగా ఉంది” అని తెలిపారు.
ఇక హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ “కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కాబట్టి ఇదొక జోనర్ మూవీ అనొచ్చు. దీన్నొక మీసాల మిస్టరీ అనుకోవచ్చు. కథ పుట్టిందే అక్కడ నుంచే. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. మీరు సినిమా చూస్తే సర్ ప్రైజ్ అవుతారు. మా టీమ్‌కు చక్కగా చూసుకున్న నిర్మాతగారికి థాంక్స్. థ్రిల్లర్ మూవీయే కాదు.. మంచి మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంది. మ్యూజికల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 31న సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేం కూడా అంతే హ్యాపీగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారని భావిస్తున్నాం” అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!