అక్కడ ఇసుక మాఫియా… రెండు నదుల్ని అడ్డంగా దోచేస్తోందా? అడ్డొచ్చేవాళ్ళు ఎవరైనా సరే… ఇక అంతే సంగతులని వార్నింగ్ ఇస్తోందా? ఇసుక మాఫియాకు లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? ఇతరులు ఇసుక రీచ్‌ల్లో అడుగుపెడితే… దబిడి దిబిడేనని అంటున్నది ఎక్కడ? ఎందుకంత బరితెగింపు? ఇష్టం వచ్చినట్టు తోడుకో…. నచ్చిన రేటుకు అమ్ముసుకో…. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియెజకవర్గంలో వినిపిస్తున్న స్లోగన్ ఇదేనట. దొరినంత దోచేయ్ అన్నట్టుగా సాగుతోందట ఇసుక దందా. కూటమి ప్రభుత్వం…