Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేని స్థితి. హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయా…