Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం…