Home
Konda Surekha
Konda Surekha News
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
OTR: మాజీ మంత్రి కొండా సురేఖ…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి గతంలో వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటించారు. దానికి సంబంధించి ఎక్స్ వేదికగా సారీ కోరడం, అందుకు సంబంధించి వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని విమర్శించే క్రమంలోనే… ఆ వ్యాఖ్యలు చేశానని, కేటీఆర్ విషయంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు. తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కొండా సురేఖ. తన వ్యాఖ్యల… -
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
Konda Surekha: హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ జంట విడిపోడానికి కేటీఆరే కారణమని మాజీ మంత్రి కొండా సురేఖ గతంలో ఆరోపణలు చేసి విషయం తెలిసిందే. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే.. తాజాగా ఈ అంశంపై కొండా సురేఖ మరోసారి స్పందించారు. -
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో సంచలన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ మొదటిసారిగా తమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించిన కొండా దంపతుల ఈ భేటీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. వర్షం కారణంగా హోటల్‌కు మారిన సమావేశ వేదిక తొలుత హనుమకొండ రాంనగర్‌లోని కొండా… -
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
Off The Record : మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ఒక ఎత్తయితే…. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. తనను మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే… పెద్దగా ఘాటు రియాక్షన్స్ ఏమీ లేకుండా సైలెంట్ అయ్యారామె. ఆలోచించి… భవిష్యత్ కార్యాచరణపై తగిన నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్పారు. ఐతే.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు… -
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
Former OSD Sumanth : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలను సమర్పించిన అనంతరం ముందస్తు బెయిల్‌పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. పోలీసుల ముందు సరెండర్ కావాలి ముందస్తు… -
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన కొండా సురేఖ మంత్రివర్గ తొలగింపు ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎన్టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యవహారంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీ ప్రతిష్ట, క్రమశిక్షణే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇబ్బందికరంగా మారిన సురేఖ కుమార్తె వ్యాఖ్యలు మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన కొన్ని ఆరోపణలు, వ్యాఖ్యలు పార్టీకి… -
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
ఆ మాజీ మంత్రి దారెటు..? ఏ పార్టీ వైపు చూస్తున్నారు..? ఆమె ఏమనుకుంటున్నారో కానీ బీఆర్ఎస్ మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. తమ పార్టీలోకి మాత్రం రానిచ్చేదిలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ పార్టీలోకే కాదు… ఆఫీస్ గేట్‌ను కూడా తాకనివ్వబోమని ముందుగానే చెప్పేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అంత కఠినంగా మాట్లాడటానికి కారణమేంటి..? అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో తాజా మాజీ మంత్రి కొండా సురేఖ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్.… -
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
OTR: ఆ మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నారా..? ఆమె కుటుంబంలో బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారా..? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా ఎక్కువకాలం ఇమడలేకపోయిన ఆమె… కాషాయదళంలో అయినా కుదురుగా ఉండగలరా..? ఆమె ఆటిట్యూడ్ కమలం పార్టీకి సూట్ అవుతుందా..? లేదంటే సంప్రదింపుల వార్తలన్నీ హంబక్కేనా..? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..? ఏమిటామె లెక్క..? లెట్స్ వాచ్. తాజా మాజీ మంత్రి కొండా సురేఖ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్స్ ఏంటి..? అత్యంత అవమానకరంగా మంత్రివర్గం నుంచి… -
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమన్నారు. అయితే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు ఇలాంటి చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసిందని తెలిపారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉన్నా, అసంతృప్తి ఉన్నా వాటిని చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని చెప్పారు. అయితే పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం క్షమించరాని తప్పని పేర్కొన్నారు. ఎవరైనా బహిరంగంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే… -
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్సీ బస్వరాజు.. కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజల మద్దతు ఎవరి వైపు…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!