Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బాధాకరమన్నారు. అయితే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు ఇలాంటి చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసిందని తెలిపారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉన్నా, అసంతృప్తి ఉన్నా వాటిని చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని చెప్పారు. అయితే పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం క్షమించరాని తప్పని పేర్కొన్నారు. ఎవరైనా బహిరంగంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయనే సంకేతాన్ని ఏఐసీసీ ఇచ్చిందని మహేష్ గౌడ్ అన్నారు.
కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సి ఉండేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. క్రమశిక్షణ సంఘం సమగ్ర నివేదిక ఆధారంగానే హైకమాండ్ చర్య తీసుకుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదన్నారు. క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికలో అన్ని అంశాలను కూలంకషంగా పొందుపరిచారని తెలిపారు.
Also Read
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు పెద్ద అంశం కాదని.. అసెంబ్లీ సమావేశాలు, అందులో జరగాల్సిన చర్చలే ఇప్పుడు తమకు కీలకమని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే క్రమశిక్షణ విషయంలో కులాలు, మతాలు, ప్రాంతాలు చూడలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆదరించాల్సిన బాధ్యత ఉందని, భవిష్యత్తులో బీసీలకు మరింత పెద్దపీట వేయాలన్న ఆలోచన హైకమాండ్‌కు ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?