Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
- కొండా సురేఖ రియాక్షన్స్‌పై రాజకీయవర్గాల ఆసక్తి
- అసెంబ్లీ సమావేశాలకు దూరంగా మాజీ మంత్రి
- నిరసన తెలపడంలో భాగమా అన్న చర్చలు
- తన మాజీ ఓఎస్డీని పోలీసులు వేధిస్తున్నారన్న ఫీలింగ్?
- కొండాతో మాట్లాడి కన్విన్స్ చేసేందుకు పీసీసీ చీఫ్ ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ఒక ఎత్తయితే…. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. తనను మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే… పెద్దగా ఘాటు రియాక్షన్స్ ఏమీ లేకుండా సైలెంట్ అయ్యారామె. ఆలోచించి… భవిష్యత్ కార్యాచరణపై తగిన నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్పారు. ఐతే.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు ఆమె మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయ్యాక… జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. మంత్రి పదవి లేకున్నా… ఎమ్మెల్యే హోదాలో సమావేశాలకు అటెండ్ కావచ్చు. కానీ…ఈ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి…అటువైపు వెళ్ళకుండా అసెంబ్లీకి దూరంగా ఉన్నారు కొండా సురేఖ.
సభ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదామె. అలాగే సీఎల్పీ మీటింగ్‌కు కూడా దూరంగానే ఉన్నారు. దాంతో… ఇది నిరసన తెలిపే క్రమంలో భాగమా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. అదే సమయంలో నిన్నటిదాకా మంత్రి హోదాలో అటెండ్ అయిన చోటికి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా రావడానికి ఇబ్బంది పడుతున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. కారణం ఏదైనా… ఇప్పటికైతే సభకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారట సురేఖ. తన మాజీ osd సుమంత్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ… పోలీసులు వేధిస్తున్నారన్న ఫీలింగ్‌లో ఆమె ఉన్నట్టు సమాచారం. ఇదే విషయమై తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కొండా సురేఖతో మాట్లాడి సుమంత్ ఎపిసోడ్‌పై వాకబు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వమని కూడా సూచించారట. మరోవైపు ఇన్నాళ్ళు కొండా సురేఖ చూసిన శాఖలు.. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోకి వెళ్తాయి. మంత్రులకు కేటాయించని శాఖలు పూర్తిగా సీఎం పర్యవేక్షణలోకి వెళ్ళడం ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలో రేపు విస్తరణ తర్వాత కొందరి పోర్ట్‌ఫోలియోలు మారే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!