కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు కొణతాల నిర్ణయించుకోవడం హర్షణీయం అని అన్నారు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన.. జనసేనలోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడు కొణతాల అని అన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో…