అమలాపురంలో జరిగిన విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వాళ్ల నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆందోళనలు, విధ్వంసంలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఉంది.. జరిగిన సంఘటన తీరు, ప్రతిపక్ష నాయకుల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మండిపడ్డ ఆయన.. పోలీసులు సంయమనం…
కోనసీమ జిల్లాకి అ౦బేద్కర్ పేరు పెట్టడానికి అన్ని పార్టీలు అ౦గీకరి౦చాయని ప్రభుత్వం మాకు ఏమైనా లేఖ ఇచ్చి౦దా..? అని ప్రశ్నించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమలాపురంలో ప్రభుత్వం ఓ చర్చకి తెరలేపి౦ది.. ప్రభుత్వానికి మారణ హోమం జరగడం కావాలని ఆరోపించారు. అమలాపురంలో వాళ్లే అంతా చేశారన్నా ఆశ్చర్య పోనక్కరలేదన్న ఆయన.. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చేశారని మండిపడ్డారు.. కోనసీమలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న బీజేపీ…
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ…
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000…
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో ఒక్కసారిగా అమలాపురం అట్టుడికిపోయింది.. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు… మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇక, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.. దీంతో, అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడింది విశాల్ గున్ని…