నంగునూర్ (మం) కొనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ యాదాద్రితో సహా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. దేవుళ్ళపై ప్రమాణం చేసి మాట తప్పిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని…