అభిమానం హద్దులు దాటితే అలాగే వుంటుంది. గతంలో రికార్డింగ్ డ్యాన్సుల సమయంలో అభిమానులు కరెన్సీ నోట్లు చల్లుతూ వుంటారు. తాజాగా కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు కరెన్సీ నోట్లతో స్వాగతం పలికారు ఆయన అభిమానులు. మామిడికుదురు మండల వైఎస్సార్సీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు భారీగా కరెన్సీ నోట్లు తెచ్చి రోడ్లమీద చల్లుతూ స్వాగతం పలకడం హాట్ టాపిక్ అవుతోంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ రాక…