ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కత కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో కేకేఆర్ ఆడిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దానిని ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించాలని చూస్తుంటే మొదటి మ్యాచ్ లో ఓటమి కారణంగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముంబై ఉంది. చూడాలి మరి…