ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. "నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, 'జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)' అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు" అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.