కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సదర్భంగా.. జెండా ఆవిష్కరించి ఆయన పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమం అనంతరం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పోర్లగడ్డ తండా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అమ్ముడుపోతున్నారని మండిపడ్డారు. వాళ్ళకు గుణపాఠం చెప్పాలని, వాళ్ళను నిలదీయండని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు కలిసిరావాలని పిలుపు…