Stampede: కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ(CUSAT)లో శనివారం జరిగిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ పాల్గొన్న ఈ కార్యక్రమం యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది.