బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం లోచోటుచేస్తుంది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని(14) బాలికపై సురేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. సంఘటన స్థలంలోనే నిందితుడు కత్తి…
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. రోజువారీగా పాఠశాలకు వెళ్తున్న టీచర్ పై ఓ వ్యక్తి పలుసార్లు కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె చనిపోయేంత వరకు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున తూర్పు బీహార్‌లోని కతిహార్‌లో చోటు చేసుకుంది. టీచర్ యశోదా దేవి (29) మంగళవారం ఉదయాన్నే లేచి దేవుడికి పూజలు చేసి.. అనంతరం పాఠశాలకు బయలుదేరిందని ఆమె కుటుంబ సభ్యులు…
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. కాగా.. డాక్టర్ కైలాష్ రాఠీగా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు నాసిక్ పంచవటిలోని సుయోగ్ హాస్పిటల్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్‌లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.