Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.