తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కిటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండీ సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం… మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా,…