Today Business Headlines 16-03-23: హైదరాబాద్‌కి బ్లాక్‌బెర్రీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఐఓటీ.. రంగంలో కెనడాకు చెందిన కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ ఏడాది హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ సంస్థకు కెనడా తర్వాత ఇదే అతి పెద్ద కేంద్రం కానుండటం విశేషం. ఇందులో వంద మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించనున్నాయి. సీనియర్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీస్ డెలివరీ తదితర జాబులు అందుబాటులోకి వస్తాయి.
Behind Story of Big Bazaar’s Downfall: ఫ్యూచర్ గ్రూప్‌లోని రిటైల్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు అక్వైర్ చేస్తున్నట్లు రిలయెన్స్ గ్రూపు ప్రకటించడంతో మూడు దశాబ్దాల కిషోర్ బియానీ రిటైల్ సామ్రాజ్యానికి తెరపడింది. అయితే.. ఆ తెర వెనక ఏం జరిగింది?. అదే ఇవాళ్టి మన స్పెషల్ స్టోరీ. కిషోర్ బియానీ తన రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించిన 20 ఏళ్లలోనే దేశం మొత్తం విస్తరింపజేశారు. ఆయన మొట్టమొదట 1997లో కోల్‌కతాలో పాంథలూన్స్‌ను ప్రారంభించారు.