తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు కైవశం చేసుకుంటుందో క్లారిటీ లేదు. కానీ.. అధికారంలోకి వస్తామనే ధీమాతో మాత్రం కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని గట్టి వ్యాఖ్యానాలే చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిందని.. ప్రజలు తమవైపే చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు నాయకులు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొందరు నాయకులు మరో అడుగు ముందుకేసి.. కీలక పదవులపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అదే కమలంపార్టీలో తాజాగా రచ్చ…