Kishan Reddy: అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు…