తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? విషయం ఏదైనాసరే… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేసేస్తున్నారా? నోరు అదుపులో పెట్టుకోమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకులకు వార్నింగ్ ఇచ్చింది నిజమేనా? అదుపు.. అదుపు… మాట పొదుపని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారా? ఇంతకీ టీజీ బీజేపీలో ఏం జరుగుతోంది? కిషన్ ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పార్టీ లైన్ దాటొద్దు…., సొంత అజెండాలతో ఎవ్వరూ మాట్లాడవద్దు. సబ్జెక్ట్ ఏదైనా, మాట్లాడేది ఎవరైనా… పార్టీ వాయిస్ ఉండాలే…