హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆమె బీజేపీలో చేరనున్నారు. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి గెలుపొందారు. ఆమె కుమార్తె శృతి చౌదరి కూడా కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.