ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. పద్మ అవార్డుల తుది జాబితాకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో.. ఆ జాబితాను ఇవాళ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.. నలుగురికి పద్మవిభూషన్, 17 మందికి పద్మభూషన్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి.. అందులో మొగిలయ్య ఒకరు.. ఆయనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు…