గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గోరంట్లకు చెందిన షేక్ నసీమా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మహిళ జీజీహెచ్‌కు చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది.