Ajmer Dargah: ప్రతిష్టాత్మక అజ్మీర్ షరీఫ్ దర్గా మరోసారి రాజకీయ వివాదంగా మారింది. దర్గాకు వ్యతిరేకంగా హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన (MPS) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2024లో హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. దర్గా ఉన్న స్థలంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని పిటిషన్లు పేర్కొంటున్నాయి.