మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్ ప్రియాంక…
First Kho Kho World Cup in India: మరో వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ‘ఖో ఖో వరల్డ్ కప్’ వచ్చే ఏడాది భారతదేశంలో జరుగనుంది. 2025లో ఖో ఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ భారత్‌లో జరుగుతుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఖో ఖో ఫెడరేషన్ సంయుక్తంగా బుధవారం ప్రకటించాయి. 24 దేశాలు, ఆరు ఖండాల నుండి.. 16 పురుష, 16 మహిళా జట్లు ఈ మెగా టోర్నీలో…
దేశీయ క్రీడలకు నెమ్మదిగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ప్రొ.కబడ్డీ లీగ్ వంటి టోర్నీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఖోఖో క్రీడకు సంబంధించి ఓ మెగా లీగ్ రాబోతోంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న అల్టిమేట్ ఖోఖో లీగ్(యూకేకే)లో తెలంగాణకు చెందిన టీమ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేసింది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) సహకారంతో ఖోఖో లీగ్‌ను డాబర్ గ్రూప్ ఛైర్మన్ అమితక బర్మన్ ఏర్పాటు చేయగా పలు రాష్ట్రాల నుంచి ఫ్రాంచైజీలు…