రవితేజ కథానాయకుడిగా సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ సినిమాను నిర్మించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగులో విషయంలో జాప్యం జరిగింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తుందేమోనని కూడా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లోకి దిగిపోయినట్టు…