మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖేద్కర్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దిలీప్ ఖేద్కర్ షెవ్‌గావ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.