Ponguleti Srinivas Reddy : పశువైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నా అభివృద్ధి పనులు ఆపకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.…
Ponguleti Srinivas : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నిస్వార్థంగా అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతి అన్నారు. రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వమని, అదే సమయంలో ఆనాటి ప్రభుత్వం రైతుబంధు పథకం గురించి…
భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది.
Grama Panchayathi: ఈ నెల 31తో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రభుత్వానికి జాబితాలను పంపారు.
R. Krishnaiah: బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా అంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కామెంట్స్ సంచలనంగా మారాయి. ఖమ్మం అంటే విప్లవమని, అనుకరణ జిల్లా కాదు ఆదర్శవంతమైన జిల్లా అని అన్నారు. స్వతంత్రభావాలు గల జిల్లా ఖమ్మం జిల్లా అని తెలిపారు.
Khammam train: రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం జరుగుతూ ఉంటాయి.
అఖిల్ సాయి మరణం పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.