Minister Thummala: వందేళ్లలో రాని వరద.. ఖమ్మం జిల్లాలో 48 వేల ఎకరాల్లో పంట నష్టం
- వందేళ్లలో రాని వరద వచ్చింది
- ఖమ్మం జిల్లాలో 48000 ఎకరాల వరకు పంట నష్టం
- వరద బాధితులకు సాయం అందిస్తున్నామన్న మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Thummala Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రుణమాఫీ చేశామని.. 22 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇంకా మరి కొంతమంది రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సంతోష సమయంలో వరదల రూపంలో ఉపద్రవం వచ్చి పడిందని ఆయన పేర్కొన్నారు. మున్నేరు నదికి భారీ వరద వచ్చిందని.. వందేళ్లలో రాని వర్షం, వరద వచ్చినట్లు తుమ్మల చెప్పారు. ఇరిగేషన్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయని తెలిపారు. ప్రస్తుతం పత్తి పూత మీద ఉందని, వరి చాలా వరకు దెబ్బతిందని.. అధికారులను నష్టంపై సర్వే చేయమని ఆదేశించామన్నారు.
Read Also: Kishan Reddy: విపత్తుగా ప్రకటించడం కాదు.. నిధులు ఇస్తున్నామా లేదా?
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ఆ తరువాత సూర్యాపేట, మహబూబాబాద్‌లో నష్టం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లాలో 48000 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసిందన్నారు. రైతులు పంటలు వేసుకునేందుకు విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐదు రోజుల పాటు జిల్లాలోనే ఉన్నానని మంత్రి తెలిపారు. మున్నేరు పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వరద బాధితులకు మంచి నీళ్లు, బియ్యం, వంట సామాగ్రి, పాలపాకెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. టెస్కో ద్వారా రెండు జతల బట్టలు, దుప్పట్లు బాధిత కుటుంబాలకు సరఫరా చేయనున్నామని వెల్లడించారు. ఇళ్లను కోల్పోయిన వారికి మళ్లీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేశానన్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!