Pannun Murder Plot: పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
కెనడాలో గత ఏడాది భారత దౌత్యా అధికారులకు వరుసగా బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. అదే టైంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు అని పేర్కొన్నారు.
పంజాబ్‌లోని మోగాలో ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అకల్ తఖ్త్ మాజీ చీఫ్, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడే అమృతపాల్ అరెస్టుకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో అమృతపాల్ సింగ్ లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుకున్న జస్బీర్ సింగ్ రోడే రహస్యంగా పోలీసులకు సమాచారాన్ని పంచుకున్నాడు.
నెల రోజుల పాటు వెంబడించిన తర్వాత పంజాబ్‌లోని మోగాలో ఆదివారం ఉదయం అరెస్టయిన ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అతని భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై నిఘా పెట్టినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Amrit Pal Singh : దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు. రెండు రోజుల క్రితమే అమృత్ పాల్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? అన్నది ఇంకా అంతు చిక్కలేదు. ఈ క్రమంలో అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.