Amritpal Singh’s wife: అమృత్‌పాల్ సింగ్ భార్యపై ప్రశ్నల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? అన్నది ఇంకా అంతు చిక్కలేదు. ఈ క్రమంలో అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లండన్ వెళ్లే విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను అమృత్‌సర్ విమానాశ్రయంలో నిలిపివేసి విచారిస్తున్నట్లు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆమెను ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రశ్నిస్తోంది.
Also Read: CM Jagan Mohan Reddy:మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై జగన్ సమీక్ష
అమృత్‌పాల్ సన్నిహితులు, బంధువులు దేశం విడిచి వెళ్లరాదని ఇప్పటికే సర్క్యులర్ జారీ అయింది. దీంతో అమృతపాల్ భార్య లండన్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అమృతపాల్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి పంజాబ్‌లో నివసిస్తానని అమృతపాల్ ప్రకటించాడు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు. అమృతపాల్‌తో వివాహం జరిగిన తర్వాత,కిరణ్‌దీప్ కౌర్ పంజాబ్‌కు వెళ్లి ఇప్పుడు అమృతపాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేడాలో నివసిస్తున్నారు. కిరణ్‌దీప్ కుటుంబ మూలాలు జలంధర్‌లో ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అమృతపాల్ పరారీ తర్వాత కిరణ్‌దీప్ కౌర్‌ను కూడా ముందుగా విచారించారు. కిరణ్‌దీప్ కౌర్ అమృత్‌పాల్‌తో టచ్‌లో లేరని పోలీసుల విచారణలో గతంలో చెప్పారు. అలాగే కిరణ్‌దీప్‌కి యూకే పౌరసత్వం ఉండటంతో ఆమె లండన్ వెళ్తుందా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కిరణ్‌దీప్ కౌర్ బ్రిటీష్ పౌరురాలు కావడంతో ఆమె పాస్‌పోర్టు భారత్‌లో చెల్లుబాటు అయ్యేది. పాస్‌పోర్ట్‌లో ఆమె ఎంతకాలం భారత్‌లో ఉండి ఉండవచ్చనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!