వినాయక చవిత వచ్చిందంటే గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు, నిమజ్జనానికి ప్రత్యేకస్థానం ఉంది.. ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరే మహా గణనాథుడి విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ప్రత్యేకమనే చెప్పాలి.. ఒక్కోఏడాది ఒక్కోరూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను ఇవాళే ఆవిష్కరించింది ఉత్సవ కమిటీ.. పంచముఖ రుద్ర మహాగణపతిగా భారీ గణనాథుడి దర్శనమివ్వనుండగా.. మండపంలో గణనాథుడికి ఎడమ…