నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం…