సినిమా వ్యాపారం అనేది రిస్క్ తో కూడుకున్నది, ఎన్ని సినిమాలు హిట్ అయినా… ఎన్ని కోట్లు రాబట్టినా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు మళ్లీ మొదటికి వచ్చి నిలబడాల్సి ఉంటుంది. ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఉన్నది కూడా అమ్ముకోని, తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. పైసా మే పరమాత్మ అనే మాటని తూచా తప్పకుండా పాటించే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ గా నిలబడాలి అంటే…
ఒక హీరోయిన్‌కి ఒకట్రెండు ఫ్లాపులు పడ్డాయంటే చాలు, ఆమెకు ఆఫర్లు మెల్లగా తగ్గుతూ వస్తాయి. ఆమె ఫ్లాప్ సెంటిమెంట్ ఎక్కడ తమ సినిమాలపై ప్రభావం చూపుతుందోనన్న ఉద్దేశంతో, తమ సినిమాల్లో తీసుకోవాలా? వద్దా? అని మేకర్స్ కాస్త జంకుతారు. కానీ, పూజా హెగ్డేకి మూడు ఫ్లాపులు వచ్చినా, ఆమెకు ఇంకా క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మార్కెట్‌లో ఆమెకున్న డిమాండ్ అలాంటిది. ఈమె కెరీర్‌లో సక్సెస్ శాతం ఎక్కువగా ఉండడం, ఇండస్ట్రీలో క్రేజ్ కూడా విస్తృతంగా ఉండడంతో..…
ఒకట్రెండు హిట్లు పడ్డాక నటీనటులు తమ పారితోషికం పెంచడం సహజమే! కాకపోతే ఒకేసారి భారీగా పెంచేయరు. గత సినిమాతో పోలిస్తే, ఒక మోస్తరు ఫిగర్ పెంచుతారు. అమాంతం పెంచేస్తే ఆఫర్లు తగ్గుముఖం పడతాయి కాబట్టి, సినిమా సినిమాకి క్రమంగా పెంచుకుంటూ పోతారు. కానీ.. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం భారీగా పెంచేసింది. స్టార్ హీరోయిన్లకు మించి కాస్త ఎక్కువ డబ్బులే ఇవ్వాలని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతోందట! తాను నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ భారీ విజయం సాధించడం…