‘కేజీఎఫ్’ రెండు చాప్టర్లు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనం సృష్టించాయె తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కన్నడ చిత్రసీమను రూపురేఖలు మార్చి, రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలిపాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించింది. అయితే పార్ట్ 2 క్లైమాక్స్‌లో చాప్టర్ 3 ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు.…