అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు.