జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు పల్లెకెలెలో జరగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జెర్సీలో భారీ మార్పు జరిగింది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా.. నెట్స్ ప్రాక్టీస్లో దూకుడు పెంచారు. సూర్యకుమార్ యాదవ్ బృందం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు.