ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్టిల్ ఫోటోగ్రాఫర్ శివన్ (89) కన్నుమూశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆయన కుమారుడే! అరవై సంవత్సరాల క్రితం ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఫోటో స్టూడియోను పెట్టారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శివన్ విశేష ఖ్యాతి గడించారు. పలు సాంస్కృతిక సంస్థలకు ఆయన ఫోటో స్టూడియోనే కేంద్రంగా ఉండేది. ఆయన తీసిన ఛాయాచిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ…