ఎండైనా, వానైనా, మంచైనా … ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మండుటెండల్లో, వడగాల్పుల్లో గంటల తరబడి నిల్చొని విధులను నిర్వహించడం ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది. వీరి కష్టాలను గమనించిన కేరళ ప్రభుత్వం… కొన్ని ప్రత్యేక సదుపాయాలతో సౌర గొడుగులను అందిస్తోంది. కేవలం తలకు చల్లదనాన్ని ఇవ్వడమేకాదు.. ఈ గొడుగుల్లో ఫ్యాన్, మంచినీటి బాటిల్ పెట్టుకునే స్టాండ్ , గొడుగుతోపాటు కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైటు ఏర్పాటుచేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.…
భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే కేరళలో నిత్యం 10 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. కేరళలో కొవిడ్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ…
ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. అయితే, 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్.. కానీ, ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం…