కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు. …