ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్‌చల్ చేసింది. పూర్వాంచల్‌కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.