రెండు రోజుల క్రితం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తనకు కాబోయేవాడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు తాను వచ్చే నెలలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. తిరుమల సన్నిధిలో కీర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీర్తి…