తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు…