సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్…
సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్ లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి…
జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ఇవాళ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ అవుతాయని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇవాళ కేటీఆర్కు ట్వీట్ చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఆమె ట్వీట్ కు బదులు ఇచ్చారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను…
అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు… ప్రస్తుతం తెలంగాణలో మాజీ మంత్రి ఈటల వ్యవహారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, కోవిడ్ సమయంలో.. ఈ పరిస్థితి ఏంటి? అంటూ రెండు ప్రభుత్వాలను నిలదీశారు వీహెచ్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ మీద పెడుతున్న శ్రద్ధ..…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్ధాయి సమావేశం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కీలక అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రగతి భవన్లో సమావేశం జరుగుతున్నది. మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ సమయం ముగియనున్నది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో…
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన…
తెలంగాణలో ఎన్టీవీ కథనం సంచలం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈటల అనుచరులు తమను బెదరించి భూములు లాక్కొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో ఇది వెలుగు చూడగా.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని…
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలని పేర్కొన్నారు. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసని.. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్ అని.. కేసీఆర్ ఒక మర్దరర్…
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార సభలో సీఎం కేసీఆర్ కేవలం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. బీజేపీని కౌంటర్ చేయలేదు. YS షర్మిల విమర్శలకు బదులివ్వలేదు. ఆ ఇద్దరినీ కేసీఆర్ ఎందుకు వదిలేశారు? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కేసీఆర్ సభలో జానారెడ్డిపైనే విమర్శలు! తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నాగార్జునసాగర్లో జరుగుతున్న ఉపఎన్నికే దీనికి కారణం. ఈ బైఎలక్షన్కు ముందు రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, నేతల విమర్శలు మరింత ఆజ్యం పోశాయి. ప్రచారం…
రాష్ట్రంలో కరోన ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్ లో వేంటిలేషన్ ఖాళీ లేవు. తాను ఉదయం నుండి ఒక్క బెడ్ కోసం ట్ర్య్ చేస్తే దొరకలేదు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నేరుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ప్రయత్నం చేసినా కరోనా పేషంట్ కు బెడ్ దొరకాకపోవడం బాధనిపిస్తుంది అని చెప్పిన ఆయన ఎందుకు ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు చేతున్నారు. ఏమయ్యాయి..వెంటిలాషన్లు… నిజాలు దాచిపెట్టి ప్రభుత్వం ఎవర్ని…