BRS vs Congress: తెలంగాణ శాసన మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి, ఫలితంగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి జూపల్లి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉంది. పూర్తిగా లేదనడం…