KCR: మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌రావుని కౌగిలించుకుని ఓదార్చారు.