తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన భద్రాకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత తారా గార్డెన్ లో కార్మిక సంఘాల సదస్సులో పాల్గొని.. కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రపై కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే దివాళా తీసింది..ఇక బీజేపీ దివాళా తీయబోతోందని ఆయన విమర్శించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని…