CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. ఈ హఠాత్ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని…